KDP: గంగవరానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి శనివారం రాత్రి తీవ్ర ఛాతినొప్పి రావడంతో కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ECGలో STEMI నిర్ధారణ కావడంతో డా. భాస్వంత్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం టెనెక్టెప్లేస్‌తో చికిత్స చేసి గుండె రక్తప్రసరణను పునరుద్ధరించింది. అనంతరం కడప రిమ్స్‌కు రిఫర్ చేశారు. వైద్య బృందానికి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వ్యక్తికి గుండెపోటు.. సకాలంలో చికిత్స


