హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణగిరిలో వైభవంగా తిరువీధి ఉత్సవ సేవ

BHNG: శ్రావణ మాస వేడుకల్లో భాగంగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.