హైదరాబాద్: 28°C
వ్యాపారం

మెటా, గూగుల్‌‌ని దాటేసిన అలీబాబా ఏఐ మోడల్స్

చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ ఓపెన్ ఏఐ మోడల్స్ 300 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్‌కు చేరాయి. కేవలం ఆరు నెలల్లోనే ఈ మార్కును దాటింది. మెటా, గూగుల్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్‌లు చేసుకున్న ఏఐ మోడల్స్‌గా నిలిచి అగ్రస్థానానికి ఎగబాకాయి. అలీబాబాకు చెందిన మోడళ్లు తక్కువ ధరలో లభించడం, సులువుగా ఉండటంతో ఆదరణ పెరిగినట్లు సమాచారం.