హైదరాబాద్: 28°C
వ్యాపారం

వెల్లడించని విదేశీ ఆస్తుల కోసం వన్‌టైమ్ విండో!

విదేశీ ఆస్తుల వివరాలను రిటర్నులో వెల్లడించని పన్నుదారుల కోసం ఐటీ శాఖ 'వన్‌టైమ్ విండో'ను అందుబాటులోకి తేనుంది. ఈ విండో రేపు ప్రారంభమై డిసెంబర్ 31న ముగియనుంది. రూ.కోటి వరకు విదేశీ ఆస్తులు లేదా ఆదాయం ఉండి ఆ వివరాలను పన్ను రిటర్నులో దాఖలు చేయని వారికి ఇది వర్తిస్తుంది. రూ.5 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులు ఉండి, ఆ వివరాలు వెల్లడించని వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.