హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్పీ చేతుల మీదుగా ఎస్సై సాగర్‌కు ప్రశంస పత్రం

ASF: విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు విశేషంగా కృషి చేసిన సిర్పూర్-టి ఎసై డి. సాగర్‌ను జిల్లా పోలీస్ శాఖ ఘనంగా అభినందించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితికాపంత్ ఆయనకు ప్రశంస పత్రాన్ని అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వర్తించినందుకు ఈ గుర్తింపు లభించింది.