GNTR: స్వాతంత్య్ర దినోత్సవం రోజున తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ వద్ద విషాదం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి కృష్ణా నదిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న తాడేపల్లి, కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కృష్ణా నదిలో ముగ్గురు బాలురు గల్లంతు


