విజయవాడ కృష్ణలంకకు చెందిన ముగ్గురు యువకులు శనివారం కృష్ణా నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. గౌతమ్, జాషువా, తేజ ఆచూకీ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గాలింపు కొనసాగుతోంది. ముగ్గురు యువకుల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నదిలో ముగ్గురు యువకుల గల్లంతు


