హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిభా ప్రశంసా పత్రం అందుకున్న మంథని ఏడీఈ

PDPL: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్పీడీసీల్ మంథని సబ్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ వంగల వెంకటనారాయణ ఉత్తమ ఏడీఈగా ఎంపికయ్యారు. శనివారం ఎన్పీడీసీల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రతిభా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. రెవెన్యూ వసూళ్లలో విశేష కృషి చేసినందుకు గాను ఈ అవార్డు దక్కినట్లు అధికారులు తెలిపారు.