హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజేతలకు బహుమతులు అందుచేత

AKP: నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. శనివారం న్యాయస్థానం ఆవరణలో విజేతలకు సర్టిఫికెట్లు, మెమొంటోలు జిల్లా ఎడిషనల్ న్యాయమూర్తి పి.నరేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇందులో జూనియర్ సివిల్ జడ్జిలు ఎం రోహిత్, శ్రీ భరణి పాల్గొన్నారు.