హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాట నిలబెట్టుకున్న సర్పంచ్'

NLG: కొత్తపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని వైష్ణవికి రూ. 25 వేల బహుమతి అందజేస్తానని ఇచ్చిన మాటను సర్పంచ్ రేణుక రాజు నిలబెట్టుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు గిఫ్టులు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.