హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా శ్రావణ మాస పూజలు ప్రారంభం

KDP: గోపవరం మండలం వల్లేరవారిపల్లె గ్రామంలోని స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం తొలి శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను గణేరు పుష్పాలు, తులసి ఆకులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.