హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ

PDPL: పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం పరిశీలించారు. అన్‌లోడింగ్ ప్రాంత కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రైల్వే సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.