ADB: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా. కే. రమేష్ ఉత్తమ అధికారిగా శనివారం ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో ఎస్సీ స్టడీ సర్కిల్ సేవలు గొప్పవని రాజర్షి షా పేర్కొన్నారు.
తెలంగాణ
ఉద్యోగ కల్పనలో ఎస్సీ స్టడీ సర్కిల్ సేవలు గొప్పవి: కలెక్టర్


