హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రత్యామ్నాయ భవనం కేటాయించాలి'

ASR: మారికవలస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 5,6,7తరగతుల విద్యార్థులను యథావిధిగా కొనసాగించాలని నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్జా వైకుమార్ శనివారం పాడేరులో డిమాండ్ చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు పేరుతో అల్లూరి జిల్లాకు చెందిన 270మంది విద్యార్థులను అర్ధాంతరంగా వెనక్కి పంపడం సరికాదన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ప్రత్యామ్నాయ భవనం కేటాయించాలన్నారు.