హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

W.G: పెంటపాడు మండలంలో ఎనిమిది నెలల కాలానికి ఏడు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎంఈవో-1 శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇంగ్లీష్ 3, హిందీ 2, బయోలాజికల్ సైన్స్ 1, ఫిజిక్స్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. డిగ్రీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.