ASR: చింతపల్లి మండలం చౌడుపల్లి-1 స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు సచివాలయంలో ఈనెల 17న పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సీతామహాలక్ష్మి శనివారం తెలిపారు. ఆదివాసీలు తమ సమస్యలపై వినతులు అందజేయవచ్చని పేర్కొన్నారు. అర్జీలను అధికారులు సకాలంలో పరిష్కరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చౌడుపల్లిలో పీజీఆర్ఎస్ కార్యక్రమం


