హైదరాబాద్: 28°C
తెలంగాణ

తలమడుగులో పర్యటించిన ఆడే గజేందర్

ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ శనివారం పర్యటించారు. గ్రామానికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ మూడుపు దామోదార్ రెడ్డి తల్లి వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గజేందర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.