హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్మార్ట్ రేషన్ కార్డులతో వివరాల పరిశీలన సులభం'

MBNR: స్మార్ట్ రేషన్ కార్డులతో కుటుంబ సభ్యుల వివరాల పరిశీలన మరింత సులభతరం కానుందని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చన్నారు.