హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీగా ఏం చేశారో చెప్పాలి: TGMDC ఛైర్మన్

HYD: మర్యాదకు హద్దులు ఉంటాయని, బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి అసభ్య భాష వాడటం సరికాదని TGMDC ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ అన్నారు. అంచెలంచెలుగా ఎదిగి టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్‌ను అవమానించడం తగదన్నారు. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ చేసిన అభివృద్ధి, పసుపు బోర్డు, గల్ఫ్ కార్మికుల కోసం చేసిన కృషిపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.