హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేల ఆరోగ్యమే.. మన ఆరోగ్యం‌'

SRPT: నేల ఆరోగ్య పరిరక్షణపై కిసాన్ సేవా రత్న పురస్కార గ్రహీత డాక్టర్ గోపయ్య వినూత్న ప్రచారం నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నడిగూడెం మండల కేంద్రంలో ఈరోజు 'సేవ్ సాయిల్', 'నేల ఆరోగ్యం కోసం.. మట్టి ఆరోగ్యం' నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నేల సారాన్ని కాపాడాలన్నారు.