హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న డీఎస్పీ

కృష్ణా: మచిలీపట్నం పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాస్ ఉత్తమ సేవా పురస్కారాన్ని శనివారం అందుకున్నారు. పోలీస్ శాఖ విధి నిర్వహణలో ప్రతిభ, అంకిత భావం, ప్రజాసేవను గుర్తిస్తూ, ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.