నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మేడంపల్లిలో పాము కాటు విషాదం నింపింది. గ్రామానికి చెందిన బుక్య రవి (45) అడవిలో వంటచెరుకు కోసం వెళ్లగా పాము కాటుకు గురయ్యా రు. కుటుంబ సభ్యులు వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే రవి మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
తెలంగాణ
పాము కాటుతో వ్యక్తి మృతి


