హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతలపూడి అభివృద్ధికి భారీ నిధులు

ELR: చింతలపూడి నియోజకవర్గాన్ని రూ.1,232 కోట్లతో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రోడ్లు, మౌలిక వసతులకు రూ.190 కోట్లు, తాగు, సాగునీటి రంగాలు, విద్యుత్, ఇతర అభివృద్ధి పనులకు భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు.