హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోలమూరులో గాంధీ విగ్రహం ఆవిష్కరణ

W.G: ఉండి మండలం కోలమూరు గ్రామంలోని గాంధీనగర్‌లో ఇవాళ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీనగర్‌కు రాకపోకలకు వంతెన నిర్మాణంలో సహకరించిన దాతలు రాజేష్‌ వర్మ, బాలరాజుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన రాజేష్‌ వర్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు జగపతి రాజు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.