హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22 మందికి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

VZM: బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు CMRF కింద రూ. 28,23,860 ఆర్థిక సాయం మంజూరైంది. ఈ నిధులకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే బేబీ నాయన శనివారం బొబ్బిలి కోటలో లబ్ధిదారులకు అందజేశారు. పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.