హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు తిరుపతమ్మ దేవస్థానం ధర్మకర్తల ప్రమాణ స్వీకారం

NTR: పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం ఆగస్టు 16న ఉదయం 7:15 గంటలకు జరగనుంది. అనంతరం మున్నేరు అవతల గల కోమరాజు శ్రీశైలపతి కళ్యాణ మండపంలో అభినందన సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే రామ్ రాజగోపాల్ పాల్గొననున్నారు.