హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న MRO

NTR: విజయవాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వీరులపాడు తహసీల్దార్ పి. రవికుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచి, ప్రజలకు మెరుగైన సేవలందించినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఆయన ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తహసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.