హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి అందాల కంటే ప్రాణాలే ముఖ్యం: FRO

ASF: సిర్పూర్ మండలం హుడ్కిలి కొండ ప్రాంతాలకు వెళ్లొద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. వర్షాల కారణంగా కొండలపై జారిపడే ప్రమాదం ఉందని, అడవి జంతువుల సంచారం కూడా ఉన్నందున ప్రాణహాని పొంచి ఉందన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించినట్లు FRO శ్రీనివాస్ శనివారం తెలిపారు. ప్రకృతి అందాల కంటే ప్రాణాలు ముఖ్యమని, ఎవరూ సాహసాలకు పాల్పడొద్దన్నారు.