హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

SRCL: ఇల్లంతకుంట మండలం వంతడ్పుల గ్రామానికి చెందిన చింతకింది భూమయ్య (59) అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెంది 14న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 15న తెల్లవారుజామున మృతి చెందాడు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.