KMR: మర్కల్ పాఠశాలలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సర్పంచ్ సుభాష్‌రెడ్డి, గ్రామ పెద్దలు కలిసి ఘనంగా సన్మానించారు. గణితంలో 100/100 మార్కులు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయుడు శివప్రసాద్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సర్పంచ్ ప్రత్యేక చొరవ చూపారని ప్రధానోపాధ్యాయుడు కిరణ్‌ప్రసాద్ తెలిపారు.
తెలంగాణ
'పాఠశాల ప్రతిభావంతులకు ఘన సన్మానం'


