హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూతగాదా విషయంలో గోడవ.. మహిళకు తీవ్రగాయాలు

MNCL: కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో శనివారం భూతగాదా విషయంలో గోదారి అనూషపై పలువురు మహిళలు దాడి చేశారు. ఘటనలో అనూష తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న భీమారం 108 సిబ్బంది ఈఎంటీ రమేశ్, పైలెట్ సంపత్ రెడ్డి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.