హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ZPTC అరెస్ట్

SKLM: నకిలీ పత్రాలు, సర్టిఫికెట్లు సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసిన కేసులో వైసీపీ ఆమదాలవలస జడ్పీటీసీ బెండి గోవిందతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై బాలరాజు వెల్లడించారు. నిందితులను శనివారం ఆమదాలవలస కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపి వీరిని అదుపులోకి తీసుకున్నారు.