హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు షాక్.. రాహుల్‌కు గాయం

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. 77 పరుగులతో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా, ఎడమ కాలికి క్రాంప్స్ రావడంతో బ్యాటింగ్ కొనసాగించలేకపోయాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో రాహుల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే అతడి గాయం తీవ్రత తెలియరాలేదు.