GNTR: గుంటూరు ఆర్టీసీ కాలనీ వద్ద కదలలేని స్థితిలో ఉన్న 45 ఏళ్ల వ్యక్తిని స్థానికుల సమాచారంతో శనివారం 108 సిబ్బంది జీజీహెచ్‌కు తరలించారు. ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతతో మాట్లాడలేక పోతుండటంతో వివరాలు తెలియరాలేదు. ఆయన బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే పాత గుంటూరు పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
జీజీహెచ్‌లో అస్వస్థతతో వ్యక్తి చేరిక


