హైదరాబాద్: 28°C
క్రీడలు

సెంచరీతో చెలరేగిన దేవదత్ పడిక్కల్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ సెంచరీతో మెరిశాడు. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న పడిక్కల్ తనకు దక్కిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. పడిక్కల్ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది తొలి సెంచరీ కావడం విశేషం.