గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. తన టెస్టు కెరీర్‌లో జైస్వాల్ ఆడిన 30 టెస్టుల్లోనూ 30 వేర్వేరు గ్రౌండ్‌లలో ఆడాడు. ఒకసారి ఆడిన స్టేడియంలో మరో మ్యాచ్ ఆడలేదు. దీంతో సచిన్ టెండూల్కర్ (32), సంజయ్ మంజ్రేకర్ (30) తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
క్రీడలు
యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డ్


