SRPT: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివని హుజూర్‌నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అనంతరం పట్టణంలో 400 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు.
వార్తలు
'స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివి'


