PLD: వినుకొండ పట్టణం శ్రీనివాస్ నగర్‌లో వైసీపీ నాయకులు గునసపొడి సాంబయ్య, గునసపొడి వీరబ్రహ్మంలను మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం పరామర్శించారు. తమ స్థలాన్ని కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశ్నించినందుకు ఇనుప రాడ్లతో దాడి చేశారని తెలిపారు. దాడికి గురైన తమపైనే కేసులు నమోదు చేసి వేధిస్తున్నారన్నారు.
వార్తలు
భూ ఆక్రమణను ప్రశ్నించిన వారిపైనే దాడులు, కేసులు!


