హైదరాబాద్: 28°C
క్రీడలు

రాహుల్, పడిక్కల్ హాఫ్ సెంచరీలు

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ (52), దేవదత్ పడిక్కల్ (69) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు సెంచరీ (109*) భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ స్కోరు 150 పరుగుల మార్క్‌ను దాటింది. జైస్వాల్ (32) రనౌట్‌గా వెనుదిరిగాడు.