NLG: నల్గొండలో రూ. 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ. 2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొందిన వారు 10 రోజుల్లో గృహప్రవేశం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందిస్తామని తెలిపారు.
వార్తలు
'రూ. 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు'


