హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు'

KMR: నిజాంసాగర్ బస్టాండ్‌లో మరుగుదొడ్ల సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. నిత్యం బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. మరుగుదొడ్లతోపాటు తాగునీరు, ఇతర కనీస మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.