హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రికెట్‌లో స్పెయిన్ ప్రపంచ రికార్డ్

స్పెయిన్ క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ యూరప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఫిన్లాండ్‌ను 8 వికెట్లతో చిత్తు చేసింది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు వరుసగా 21 విజయాలను నమోదు చేసింది. దీంతో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేసింది. గతంలో 20 విజయాలతో ఆసీస్ పేరు మీద ఈ రికార్డు ఉండేది.