హైదరాబాద్: 28°C
క్రీడలు

పంద్రాగస్టు వేడుకల్లో టీమిండియా

టీమ్‌ఇండియా గాలెలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించింది. తొలి టెస్టుకు ముందు హోటల్‌ వద్ద భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు ఆటగాళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ గీతం ఆలపిస్తూ దేశభక్తిని చాటారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని గిల్ పేర్కొన్నారు.