NLG: స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన గంట సంధ్య ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చండూరు మండలం పరిధిలోని చొప్పరవారిగూడెం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
'ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా కస్తాల వాసి'


