హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కంటి నుంచి నీరు కారుతుందా..?

కంటి నుంచి నీరు కారడం (ఎపిఫోరా) అనేది సాధారణ సమస్య. కంట్లో దుమ్ము పడటం, అలెర్జీలు, కంటి ఇన్ఫెక్షన్లు (కండ్లకలక), లేదా కన్నీటి నాళాలు మూసుకుపోవడం దీనికి ప్రధాన కారణాలు. చల్లటి నీటితో కళ్లను కడుక్కోవడం, బయటికి వెళ్లేటప్పుడు అద్దాలు వాడాలి. చేతులతో కళ్లను తరచుగా రుద్దకూడదు. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించడం మంచిది.