హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కంటినిండా నిద్ర కరువైందా? ఇలా చేయండి

ప్రశాంతమైన నిద్ర కోసం పడకగదిని చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచాలి. పడుకునే ముందు ఒత్తిడి, ఆందోళనలను పక్కన పెట్టాలి. ప్రతిరోజూ ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీర జీవ గడియారం క్రమబద్ధమై, రాత్రివేళ సరైన సమయంలో నిద్ర వస్తుంది. మొబైల్ వినియోగాన్ని తగ్గించి, ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం కూడా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.