హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..?

శరీరంలోని వ్యర్థాలను వడపోసే కిడ్నీలను క్లీన్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. రోజూ తగినంత నీరు తాగడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. పొటాషియం సమతుల్యంగా ఉండే కీరదోస, పుచ్చకాయ, ఆపిల్ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ప్యాకెట్ ఫుడ్స్ తగ్గించడం శ్రేయస్కరం.