హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం’

AKP: కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తోందని స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద తెలిపారు. అనకాపల్లిలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలు స్వీకరించారు. అర్హులైన పేదలకు త్వరలో పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు. అనారోగ్య బాధితుల నుంచి సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు తీసుకున్నారు.