హైదరాబాద్: 28°C
వార్తలు

మిషన్ భగీరథ నీటి దుర్వినియోగం

NRPT: మక్తల్(M) దాసరి దొడ్డి గ్రామంలో మిషన్ భగీరథ నీటిని గ్రామస్తులు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. నల్లాలకు మోటర్లు పెట్టి నీటిని తోడటం, ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను కడగడానికి ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరికి నీరు అందడం లేదు. నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.