హైదరాబాద్: 28°C
వార్తలు

మౌంట్ ఎల్బ్రస్‌పై త్రివర్ణ పతాకం ప్రదర్శన

ELR: రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై వి. వెంకటేశ్వరరావు దేశభక్తికి సాహసాన్ని జోడించి అరుదైన రికార్డు సృష్టించారు. భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, రష్యాలోని కాకసస్ పర్వత శ్రేణుల్లో ఉన్న అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ (5,642 మీటర్లు) శిఖరాన్ని అధిరోహించారు. శిఖరాగ్రంపై సుమారు 100 మీటర్ల పొడవైన భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.